Uttar Pradesh: పాఠశాల బస్సులో భారీ కొండచిలువ.. ఆదివారం కావడంతో తప్పిన ముప్పు.. వీడియో ఇదిగో
- పార్క్ చేసిన స్కూలు బస్సులోకి దూరిన కొండచిలువ
- పదకొండున్నర అడుగుల పొడువు.. 80 కేజీల బరువున్న పాము
- మేకలను తినేందుకు వచ్చి బస్సులో దూరిన వైనం
పార్క్ చేసిన ఓ స్కూలు బస్సులోకి దూరిన భారీ కొండచిలువను అటవీ అధికారులు రక్షించి అడవిలో వదిలిపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో జరిగిందీ ఘటన. ఆదివారం కావడంతో ర్యాన్ పబ్లిక్ స్కూలుకు చెందిన బస్సును డ్రైవర్ తన ఇంటి సమీపంలో పార్క్ చేశాడు. బస్సులోకి దూరిన కొండచిలువ అందులో తిష్ఠ వేసింది. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే సర్కిల్ అధికారి వందన సింగ్, సిటీ మేజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారు. కొండచిలువను గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి అరగంట పాటు కష్టపడి ఒడుపుగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. బస్సులో దాక్కున్న కొండచిలువను బయటకు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.