Sleep Deprivation: నిద్రలేమితో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు: నిపుణుల హెచ్చరిక

lack of sleep affects the body in the long run

  • మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది
  • ఆహారం, ఊపిరి తరహాలోనే కంటినిండా నిద్ర తప్పనిసరి
  • రోజుకు ఎనిమిది గంటలు నిద్రించాలి

ఊపిరి పీల్చుకోవడం, ఆహారం తీసుకోవడం తరహాలోనే కంటి నిండా నిద్ర పోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరమని చెపుతున్నారు. అప్పుడే శరీరానికి తగిన విశ్రాంతి లభిస్తుందని వివరించారు. మెలకువగా ఉన్నపుడు అలసిపోయిన శరీర అవయవాలు నిద్రలో తిరిగి శక్తిని ఆర్జిస్తాయని వివరించారు. మెదడు చురుకుగా మారుతుందని చెప్పారు. నిద్రలేమి వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్నారు. మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం లోపిస్తుందని, దీనివల్ల జీవన ప్రమాణం తగ్గిపోతుందని తెలిపారు.
 
ఎదురయ్యే సమస్యలు..
ఆలోచనలపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తుంటారని నిపుణులు తెలిపారు. గుండె ఆరోగ్యంపైనా ఎఫెక్ట్ తప్పదన్నారు. గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అని వివరించారు. మెదడు పనితీరు మందగిస్తుందని, నిర్ణయాలు తీసుకునే శక్తి కొరవడుతుందని హెచ్చరించారు. నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెద్ద మొత్తంలో విడుదల అవుతుందని, ఇది ఒత్తిడికి, అతిగా ఆహారం తీసుకోవడానికి కారణమవుతుందని వివరించారు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి లావెక్కుతారని పేర్కొన్నారు. వీటితో పాటు రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, హైబీపీ తదితర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News