Pawan Kalyan: ముఖ్యమంత్రి పదవి వరిస్తే మంచిదే: పవన్ కల్యాణ్
- వైసీపీ కాపు ఎమ్మెల్యేలు జగన్ కు ఊడిగం చేస్తున్నారన్న పవన్
- కులాన్ని కించపరిచేలా వ్యవహరించొద్దని హితవు
- విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తనతో కలిసి రావాలని విన్నపం
వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు ఊడిగం చేస్తూ కులాన్ని తక్కువ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కావాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని, మొత్తం కులాన్ని ఎందుకు తగ్గిస్తారని చెప్పారు. జగన్ ను పొగిడితే పొగుడుకోండి, కులాన్ని కించపరచొద్దని అన్నారు.
తనకు కులం లేదని... అన్ని కులాలు బాగుండాలని కోరుకునే వ్యక్తినని తెలిపారు. వైసీపీ కాపు ఎమ్మెల్యేలకు పిచ్చిగా వాగొద్దని చెపుతున్నానని... కులం మీ వెంట రాదు అని మండిపడ్డారు. బంతి, కొట్టు సన్నాసుల్లారా నన్ను వివాదాల్లోకి లాగొద్దని అన్నారు. తాను నక్సలైట్లు ఉండే ప్రాంతాల్లో కూడా పర్యటించానని చెప్పారు. ఉత్తారాంధ్ర ప్రాంతంలో తిరిగానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తనతో కలసి రావాలని కోరారు. ఈ పోరాటంలో ముఖ్యమంత్రి పదవి వరిస్తే మంచిదేనని... సీఎం అయితే ముందు రాష్ట్రాన్ని బాగు చేసి, ఆ తర్వాత వైసీపీ గూండాల తాట తీస్తానని అన్నారు. భగవంతుడు ఆ అవకాశాన్ని ఇవ్వాలనే కోరుకుంటున్నానని చెప్పారు.