Hyderabad: హైదరాబాదీ హలీమ్ కు మరోమారు దక్కిన అరుదైన గుర్తింపు
- 2010లో హైదరాబాద్ హలీమ్ కు జీఐ గుర్తింపు
- మోస్ట్ పాప్యులర్ జీఐగా అవార్డుకు ఎంపికైన రంజాన్ స్పెషన్ డిష్
- గతంలోనూ ఓ సారి ఈ అవార్డును దక్కించుకున్న హలీమ్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ వస్తోందంటే... అందరి చూపు హైదరాబాద్ వైపు తిరుగుతుంది. రంజాన్ మాసంలో హైదరాబాద్ లో ప్రత్యేకంగా తయారు చేసే హలీమ్ ను రుచి చూడాలని కోరుకోని వారు ఉండరు. హైదరాబాద్ బిర్యానీ మాదిరిగా నగరానికి మరో స్పెషల్ గా మారిన హలీమ్ కు ఇప్పుడు తాజాగా అరుదైన గుర్తింపు దక్కింది. మోస్ట్ పాప్యులర్ జీఐగా హైదరాబాద్ హలీం ఎంపికైంది. రసగుల్లా, బికనీర్ భుజియా వంటి 17 వంటకాలను వెనక్కు నెట్టిన హలీమ్ ఈ అవార్డును అందుకుంది.
భారతీయులతో పాటు విదేశీయులు పాల్గొన్న ఓటింగ్ ద్వారా భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హలీమ్ ను మోస్ట్ పాప్యులర్ జీఐ అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాద్ హలీమ్ కు 2010లోనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మోస్ట్ పాప్యులర్ జీఐ అవార్డును గతంలోనూ హైదరాబాద్ హలీమ్ ఓ దఫా చేజిక్కించుకుంది.