Andhra Pradesh: ఏపీ ఇంచార్జి సీఎస్ గా విజయానంద్... ఆర్ అండ్ బీకి ప్రవీణ్ ప్రకాశ్

senior ias officer vijayanand is the incharge cs to ap
  • అనారోగ్యంపాలైన సమీర్ శర్మ స్థానంలో విజయానంద్
  • సివిల్ సప్లైస్ ఎండీగా వీరపాండియన్ కు పోస్టింగ్
  • ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా దాస్ కు అదనపు బాధ్యతలు
ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించి, ఆ తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తాజాగా రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. అదే విధంగా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్ ను రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది. ఈ పోస్టుతో పాటు మార్క్ ఫెడ్ జేఎండీ పోస్టును ఆయనకు అదనంగా అప్పగించింది. 

ఇక ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అనారోగ్యం బారిన పడగా... ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ కు సీఎస్ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.
Andhra Pradesh
YSRCP
AP CS
Sameer Sharma
Praveen Prakash
Vijayanand

More Telugu News