PM Modi: కేదార్ నాథ్ లో ప్రధాని.. స్థానిక సంప్రదాయ వస్త్రధారణలో మోదీ!

PM Modi dons traditional Himachali Chola Dora offers prayers at Kedarnath shrine

  • హిమాచలి సంప్రదాయ వస్త్రాలైన చోలా డోరాతో కనిపించిన ప్రధాని
  • కేదార్ నాథ్ ఆలయంలో పూజలు
  • అనంతరం బద్రీనాథ్ ఆలయ సందర్శన
  • పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు (21వ తేదీ) ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కేదార్ నాథ్ చేరుకున్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. కేదార్ నాథ్, బద్రీనాథ్  ధామ్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో గౌరీ కుండ్ నుంచి కేదార్ నాథ్ వరకు 9.7 కిలోమీటర్ల పొడవైన రోప్ వే ప్రాజెక్టు, జాతీయ రహదారి 7, 107 విస్తరణ ప్రాజెక్టులు ఉన్నాయి. 

ప్రధాని పర్యటన నేపథ్యంలో కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాలను పూలతో అలంకరించారు. హిమాచలి సంప్రదాయ వస్త్రధారణతో ప్రధాని మోదీ మొదటి సారి దర్శనమిచ్చారు. చోలా డోరా ధరించి కేదార్ నాథ్ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఇక్కడి నుంచి బద్రీనాథ్ ఆలయానికి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

  • Loading...

More Telugu News