UK: బ్రిటన్ ప్రధాని రేసులోకి బోరిస్​ జాన్సన్​.. అయినా వంద మంది ఎంపీల మద్దతుతో రిషి సునాక్​ ముందంజ!

Rishi Sunak leads UK PM race even as Boris Johnson plans dramatic return to power
  • ఇంకా అధికారికంగా పీఎం రేసులోకి రాని సునాక్.. అయినా  అందరి మద్దతు
  • ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్టు ఎంపీ పెన్నీ మోర్డాంట్ ప్రకటన
  • మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా తిరిగి పదవి ఆశిస్తున్నట్టు ప్రచారం
అనూహ్య పరిణామాలు, క్యాబినెట్ తిరుగుబాటు అనంతరం ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ 45 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేయడంతో బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించేందుకు బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరు? అనే చర్చ మొదలైంది. ట్రస్ వారసురాలిగా దేశానికి నాయకత్వం వహించేందుకు ఎంపీ పెన్నీ మోర్డాంట్ రేసులోకి వచ్చారు. సహచరుల మద్దతు ఉందని చెబుతూ ఆమె ఆధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. మోర్డాంట్ గత ఎన్నికల్లోనే ప్రధాని అభ్యర్థిగా రేసులో నిలిచారు. కానీ, రిషి సునాక్, లిజ్ ట్రస్‌ల చేతిలో ఓడిపోయారు. 

లిజ్ ట్రస్ నిష్క్రమణ తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, యూకే తదుపరి ప్రధాన మంత్రిగా మారడానికి రిషి సునాక్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తన అనాలోచిత నిర్ణయాలతో ప్రధాని పీఠాన్ని వదులుకున్న బోరిస్ జాన్సన్ కూడా విహార యాత్రను విరమించుకొని యూకే తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి పదవి చేపట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో, యూకేలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 

పెన్నీ మోర్డాంట్ అధికారికంగా ప్రధాని రేసులోకి వచ్చిన తర్వాత పార్టీ, జాతీయ ప్రయోజనాల కోసం నాయకత్వం కోరుకునే సహోద్యోగుల నుండి తనకు మద్దతు లభించిందని పేర్కొన్నారు. అయితే, రిషి సునాక్, బోరిస్ జాన్సన్ ఇంకా తమ ప్రచారాలను అధికారికంగా ప్రారంభించలేదు. అయితే, రిషి సునాక్‌కు 100 మంది ఎంపీల మద్దతు ఉంది. సోమవారం జరిగే తొలి రౌండ్ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఒక్కో అభ్యర్థికి కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం.

ప్రస్తుతానికి, 22 మంది ఎంపీలు పెన్నీ మోర్డాంట్‌కు మద్దతు ఇవ్వగా, 48 మంది ఎంపీలు బోరిస్ జాన్సన్ తిరిగి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. పార్లమెంటులో 357 మంది టోరీ ఎంపీలు ఉన్నారు కాబట్టి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వంది మంది ఎంపీల మద్దతు ఒకే వ్యక్తికి ఉంటే తనే తదుపరి ప్రధాని అవుతారు. వంద మంది ఎంపీల మద్దతు ఒక్కరికే లభిస్తే తనే ప్రధాని అవుతారు.
UK
rishi sunak
Boris Johnson
Liz Truss
Prime Minister
100 MPs

More Telugu News