Dhramana Krishna Das: ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగనే సీఎం..  కాకుంటే రాజీనామా చేస్తా: ధర్మాన కృష్ణదాస్

YCP Leader Dhrmana Krishna Das dared TDP and Janasena to Contest in 175 seats

  • శ్రీకాకుళం జిల్లా చీడిపూడిలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’
  • జగన్ సమర్థుడైన నాయకుడని ప్రశంసించిన ధర్మాన
  • పొత్తు లేకుండా 175 స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ, జనసేనకు కృష్ణదాస్ సవాల్

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ జోస్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని చీడిపూడి గ్రామంలో నిన్న జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుంటే తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని అన్నారు.జగన్ సమర్థుడైన నాయకుడని, పొత్తు లేకుండానే అన్ని స్థానాలకు పోటీ చేస్తారని కృష్ణదాస్ పేర్కొన్నారు. 

పొత్తు లేకుండా టీడీపీ, జనసేన 175 స్థానాల్లో పోటీ చేయగలవా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేయాలని జగన్ చూస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన మాత్రం ఆ 25 గ్రామాల ప్రజల కోసం పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. టీడీపీకి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం అంటే సినిమా కాదని, దానికి ఎంతో పరిణితి కావాలని పవన్‌కు కృష్ణదాస్ సూచించారు.

  • Loading...

More Telugu News