Arshdeep Singh: పాకిస్థాన్ ప్రమాదకర ఆటగాళ్లిద్దరినీ వెనక్కి పంపిన ఆర్షదీప్
- టీ20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్
- బాబర్ అజామ్ డకౌట్
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మెల్బోర్న్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న సూపర్-12 మ్యాచ్ లో టీమిండియాకు శుభారంభం లభించింది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోగా, ఆ నిర్ణయం సబబేని నిరూపిస్తూ లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ ఓపెనింగ్ స్పెల్ లో విజృంభించాడు. పాకిస్థాన్ ప్రమాదకర ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్ (0), మహ్మద్ రిజ్వాన్ (4)లను స్వల్ప స్కోర్లకే వెనక్కి పంపాడు.
తొలుత ఓ స్వింగ్ డెలివరీతో బాబర్ అజామ్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న ఈ యువ సర్దార్జీ... ఆపై ఓ బౌన్సర్ తో రిజ్వాన్ ను బోల్తాకొట్టించాడు. దాంతో పాకిస్థాన్ 15 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం పాకిస్థాన్ స్కోరు 7 ఓవర్లలో 2 వికెట్లకు 41 పరుగులు. షాన్ మసూద్ (24 బ్యాటింగ్), ఇఫ్తికార్ అహ్మద్ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.