bowling coach: హార్థిక్ పాండ్యా ఫిట్.. ఎవరికీ విశ్రాంతి ఇవ్వడం లేదు: బౌలింగ్ కోచ్

Hardik Pandya is fit to play we are not going to rest anyone India bowling coach Paras Mhambrey

  • అన్ని మ్యాచుల్లో ఆడాలనే పాండ్యా కోరుకుంటున్నట్టు వెల్లడి
  • అతడో ముఖ్యమైన ఆటగాడిగా అభివర్ణన
  • విడిగా ఆటగాళ్లు ఫామ్ లోకి రావాల్సి ఉందన్న అభిప్రాయం

భారత్ తురుపు ముక్క, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఫిట్ నెస్ పై వస్తున్న సందేహాల పట్ల భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోజ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ కు పాండ్యా అందుబాటులో ఉండకపోవచ్చని, కొందరికి విశ్రాంతి ఇవ్వొచ్చంటూ వస్తున్న అంచనాలతను తోసిపుచ్చాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో పాండ్యా, కోహ్లీతో కలసి కీలకంగా నిలవడం తెలిసిందే. 

కాకపోతే మ్యాచ్ చివర్లో క్రాంప్స్ తో పాండ్యా కొంత ఇబ్బంది పడ్డాడు. దీంతో సిడ్నీలో 27న నెదర్లాండ్స్ తో మ్యచులో అతడు ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. దీనికి పరాస్ మాంబ్రే స్పందిస్తూ.. హార్థిక్ పాండ్యా మ్యాచ్ ఆడేందుకు ఫిట్ గానే ఉన్నాడని, అతడు అన్ని మ్యాచుల్లో ఆడాలనే కోరుకుంటున్నాడని స్పష్టం చేశాడు. ‘‘మేము ఎవరికీ విశ్రాంతి ఇవ్వడం లేదు. టోర్నమెంట్ లో మరింత ముందుకు వెళ్లే అనుకూలత మాకుంది. విడిగా ఆటగాళ్లు అందరూ ఫామ్ లోకి రావాల్సి ఉంది’’అని తెలిపాడు. 

పాకిస్థాన్ పై కోహ్లీ అపురూప ఇన్నింగ్స్ విషయంలో పాండ్యాను సైతం అభినందిచాలని మాంబ్రే సూచించాడు. కోహ్లీ బ్యాట్ తో రెచ్చిపోతుంటే, మరోవైపున్న పాండ్యా పూర్తి సహకారం అందించడం ద్వారా కీలక పాత్ర పోషించడం తెలిసిందే. పాండ్యా మనకు ఎంతో కీలకమైన ఆటగాడిగా పేర్కొన్నాడు. మరోవైపు బౌలర్ అర్ష దీప్ సింగ్  ఒత్తిళ్లు ఎదుర్కొనే తీరు నిజంగా అద్భుతమని వ్యాఖ్యానించాడు 

  • Loading...

More Telugu News