Santhosh Sobhan: నేనెవరో ప్రభాస్ కి తెలుసుగానీ త్రిషకి తెలియదు: సంతోష్ శోభన్

Santosh Sobhan Interview
  • సంతోష్ శోభన్ తాజా చిత్రంగా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'
  • కథానాయికగా సందడి చేయనున్న ఫరియా 
  • దర్శకుడిగా మేర్లపాక గాంధీ 
  • నవంబర్ 4వ తేదీన సినిమా విడుదల     
ప్రభాస్ - త్రిష కాంబినేషన్లో 2004లో వచ్చిన 'వర్షం' సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన శోభన్ తనయుడే సంతోష్ శోభన్. ఆ సినిమాతోనే ప్రభాస్ తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. ఆ కృతజ్ఞతను ప్రభాస్ మరిచిపోలేదు. అందువల్లనే ఆయన సంతోష్ శోభన్ సినిమాల ప్రమోషన్స్ లో తప్పకుండా పాల్గొంటూ ఉంటాడు. అతని సినిమాలు జనంలోకి వెళ్లడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తుంటాడు. 

సంతోష్ శోభన్ తాజా చిత్రమైన 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' సినిమా ట్రైలర్ ను కూడా ప్రభాస్ రిలీజ్ చేయడం జరిగింది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంతోష్ శోభన్ .. ఫరియా .. దర్శకుడు మేర్లపాక గాంధీ 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది.

అలీ ప్రశ్నలకి సంతోష్ శోభన్ స్పందిస్తూ .. తాను 'వర్షం' డైరెక్టర్ కొడుకుననే విషయం త్రిషకి తెలియదని చెప్పాడు. అయితే తనని త్రిషగా భావిస్తూ మనసులో మాటను చెప్పమంటూ అలీ సంతోష్ శోభన్ ను ఆటపట్టించాడు. త్రిష మాదిరిగా అలీ నటించడంతో సంతోష్ శోభన్ పడి పడి నవ్వేశాడు. సరదాగా .. సందడిగా  సాగిన ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
Santhosh Sobhan
Faria
Merlapaka Gandhi Movie

More Telugu News