Cultural Competitions: డిసెంబరులో జగనన్న సాంస్కృతిక సంబరాలు... రాష్ట్రవ్యాప్తంగా పోటీలు

AP govt will organize cultural competitions in December

  • ఏపీలో కళల పరిరక్షణకు ప్రభుత్వ సంకల్పం
  • కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం
  • డిసెంబరు 19, 20 తేదీల్లో పోటీలు
  • దరఖాస్తులకు తుదిగడువు నవంబరు 10

రాష్ట్రంలోని వివిధ కళారూపాలకు మరింత ప్రాచుర్యం కల్పించడం, కళాకారులను ప్రోత్సహించడం తదితర లక్ష్యాలతో ఏపీలో జగనన్న సాంస్కృతిక సంబరాలు పేరుతో పోటీలు నిర్వహించనున్నారు. డిసెంబరు 19, 20 తేదీల్లో ఈ కళా జాతర ఘనంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

బుర్రకథలు, థింసా నృత్యం, కూచిపూడి, పగటివేషాలు, కొమ్ముకోయ, గరగలు, తప్పెటగుళ్లు వంటి కళలకు సంబంధించి పోటీలు జరపనున్నారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ సంప్రదాయ, జానపద, గిరిజన సాంస్కృతిక సంబరాల్లో పాల్గొనే కళాకారులు, కళా బృందాలు దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 10న తుదిగడువుగా నిర్ణయించారు. 

ఈ వెబ్ లింకు (https://culture.ap.gov.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా పూర్తిచేసిన దరఖాస్తులను [email protected] కు పంపవచ్చు. అంతేకాదు, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, గుంటూరు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లోనూ, విజయవాడలోని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి కార్యాలయంలోనూ దరఖాస్తులను నేరుగా అందించవచ్చు. 

దీనిపై రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ, ఏపీకి ఎంతో ఘనమైన ప్రాచీన సంస్కృతి ఉందని వెల్లడించారు. ఆ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు భావితరాలకు చాటిచెప్పేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ క్రమంలోనే రాష్ట్రస్థాయిలో సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News