Sunil Gavaskar: రోహిత్ శర్మ ఫామ్ పై గవాస్కర్ ఆందోళన

Rohit Sharma form is worrying team india says Gavaskar
  • కొన్ని రోజులుగా రోహిత్ స్థాయికి తగ్గట్టు ఆడటం లేదన్న గవాస్కర్
  • ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య రోహిత్ ఫామ్ అని వ్యాఖ్య
  • రోహిత్ ఆడితే తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ కు ఈజీగా ఉంటుందన్న గవాస్కర్
టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లీ వీరోచిత బ్యాటింగ్, హార్దిక్ పాండ్యా సమయోచిత ఇన్నింగ్స్ తో భారత్ విజయం సాధించింది. అయితే కొన్ని రోజులుగా కెప్టెన్ రోహిత్ శర్మ సరిగా రాణించడం లేదు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశారు. 

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ... రోహిత్ శర్మ ఫామ్ ను కోల్పోవడం టీమిండియాను ఆందోళనకు గురి చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య రోహిత్ ఫామ్ అని అన్నారు. కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గట్టుగా రోహిత్ ఆడటం లేదని చెప్పారు. రోహిత్ ఆడితే ఆ తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ కు ఈజీగా ఉంటుందని అన్నారు. వచ్చీ రాగానే హిట్టింగ్ చేస్తే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు. తదుపరి జరిగే మ్యాచ్ లలో తొలి 6 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా ఉండటం కీలకమని అన్నారు. రేపు నెదర్లాండ్స్ తో భారత్ తలపడబోతోంది.
Sunil Gavaskar
Rohit Sharma
Team India

More Telugu News