TRS: టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్

ex mp rapolu ananda bhaskar joins into trs

  • 2012లో కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన రాపోలు
  • పదవీ కాలం పూర్తి అయ్యాక 2019లో బీజేపీలో చేరిన మాజీ ఎంపీ
  • బుధవారం ఉదయమే బీజేపీకి రాజీనామా చేసిన వైనం
  • కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీసీ నేత

బీజేపీకి రాజీనామా చేసిన రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేనేత కుటుంబానికి చెందిన రాపోలు...2012లో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2018 వరకు ఎంపీగా కొనసాగారు. ఎంపీ పదవీకాలం పూర్తి అయ్యాక 2019లో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. 

తాజాగా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే సీఎం కేసీఆర్ తో భేటీ అయిన రాపోలు... బీజేపీ విధానాలపై విమర్శలు గుప్పించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. అదే సమయంలో చేనేతకు భరోసా కలిగించేలా టీఆర్ఎస్ సర్కారు చర్యలు చేపట్టిందని కేసీఆర్ సర్కారును కీర్తించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం బీజేపీకి రాజీనామా చేసిన ఆయన రాత్రికే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.

  • Loading...

More Telugu News