Gallup law and order index: ‘నివాసానికి’ అత్యంత ప్రమాదకర దేశాలు ఇవే!
- ఆఫ్ఘనిస్థాన్ లో రక్షణ పాళ్లు అతి తక్కువ
- ఈ దేశానికి 51పాయింట్లు
- సింగపూర్ లో భద్రత ఎక్కువ
- ఈ దేశానికి 96 పాయింట్లు కేటాయింపు
- గాల్లప్ శాంతి భద్రతల సూచీ 2022 విడుదల
ఈ భూమిపై నివసించడానికి అత్యంత ప్రమాదకర దేశాలు ఏవో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ‘గాల్లప్ శాంతి భద్రతల సూచీ 2022’ ఈ వివరాలను వెల్లడించింది. వరుసగా మూడో ఏడాది ప్రపంచంలో భద్రత అతి తక్కువగా ఉన్న దేశంగా తాలిబాన్లు ఏలుతున్న ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది. ఈ దేశం స్కోర్ 51గా ఉంది. గాబాన్ 54, వెనెజులా 55, డీఆర్ కాంగో 58, సియెర్రా లియోన్ 59 స్కోరుతో భద్రత తక్కువగా ఉన్న టాప్-5 దేశాలుగా నిలిచాయి. తూర్పు ఆసియాలో భద్రత ఎక్కువ ఉండగా, ఆగ్నేయాసియా రెండో స్థానంలో ఉంది.