Bcci: మహిళా క్రికెటర్లకు శుభవార్త చెప్పిన బీసీసీఐ
- మ్యాచ్ ఫీజులో ఇకపై తేడా ఉండదు: బీసీసీఐ
- మహిళా క్రికెటర్లకూ మగవాళ్లతో సమానంగా ఫీజు
- క్రికెట్ లో లింగ సమానత్వమంటూ జై షా ట్వీట్
మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు చెల్లించనున్నట్లు ప్రకటించింది. పురుషులు, మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను సమం చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. క్రికెట్ లో లింగ సమానత్వానికి పెద్దపీట వేస్తున్నామని, మహిళలకూ పురుషులతో సమానంగా ఫీజులు చెల్లించాలని నిర్ణయించామని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న రెండో దేశంగా భారత్ నిలిచింది. గత జులైలో న్యూజిలాండ్ కూడా మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయించింది.
వన్డే మ్యాచ్ కు రూ. 6 లక్షలు..
ఇకపై మహిళా క్రికెటర్లు ఒక్కో వన్డే మ్యాచ్ కు రూ.6 లక్షలు, టెస్ట్ మ్యాచ్ కు రూ.15 లక్షలు, టీ20 మ్యాచ్ కు రూ.3 లక్షల చొప్పున పారితోషికం అందుకుంటారు. గతంలో వన్డే మ్యాచ్ కు రూ.2 లక్షలు, టెస్ట్ మ్యాచ్ కు రూ.4 లక్షలు, టీ20 మ్యాచ్ కు రూ.2.5 లక్షలను మహిళా క్రికెటర్లు అందుకునే వారు.