Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 213 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 81 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 పాయింట్లకు పైగా లాభపడ్డ టాటా స్టీల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివరి అరగంటలో మళ్లీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో... చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 213 పాయింట్లు లాభపడి 59,757కి పెరిగింది. నిఫ్టీ 81 పాయింట్లు పుంజుకుని 17,737కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.02%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.49%), సన్ ఫార్మా (2.08%), భారతి ఎయిర్ టెల్ (2.03%), టైటాన్ (1.45%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.92%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.68%), ఏసియన్ పెయింట్స్ (-1.32%), టెక్ మహీంద్రా (-0.68%), నెస్లే ఇండియా (-0.60%).