Kamareddy District: ఈ పాత్ర రెండువేల ఏళ్ల నాటిది.. బాన్సువాడలో బయటపడింది!
- బాన్సువాడ సమీపంలోని బోర్లాం గ్రామంలో మట్టి దిబ్బపై లభ్యం
- ప్రాకృత భాష, బ్రహ్మీలిపిలో లఘుశాసనం
- శాతవాహన కాలం నాటి చారిత్రక అవశేషంగా గుర్తింపు
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండువేల సంవత్సరాల నాటి పాత్ర లభ్యమైంది. ఈ మేరకు తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ హెరిటేజ్ సంస్థ (ప్రిహా) ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాస్ తెలిపారు. బాన్సువాడ సమీపంలోని బోర్లాం గ్రామంలో ఓ మట్టిదిబ్బపై ఈ పాత్ర లభించినట్టు చెప్పారు. దీనిపై క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రహ్మీ లిపిలో లఘుశాసనం ఉన్నట్టు పేర్కొన్నారు.