Hansika Motwani: బోయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలపైకి హన్సిక మోత్వానీ?
- డిసెంబర్ 4న పెళ్లి
- వెలుగులోకి సమాచారం
- వేదిక రాజస్థాన్ లోని జైపూర్
- అధికారికంగా రాని ప్రకటన
కథానాయిక హన్సిక మోత్వానీ త్వరలోనే పెళ్లికూతురు కానుంది. డిసెంబర్ 4న జైపూర్ లో ఆమె బోయ్ ఫ్రెండ్ ను పెళ్లాడనున్నట్టు హిందుస్థాన్ టైమ్స్ పోర్టల్ రిపోర్ట్ చేసింది. పెళ్లి కార్యక్రమాలు డిసెంబర్ 2న మొదలవుతాయని, అదే రోజు సుఫీ నైట్, తర్వాతి రోజు మెహెందీ, సంగీత్ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది.