Jharkhand: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు

Jharkhand Chief Minister Hemant Soren summoned by ED in illegal mining case

  • నవంబర్ 3న విచారణకు హాజరుకావాలని ఆదేశం
  • అక్రమ మైనింగ్ కేసులో ప్రశ్నించనున్న ఈడీ
  • సోరెన్ అనుచరుడు మిశ్రా ఇప్పటికే అరెస్ట్

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో తమ ముందు విచారణకు నవంబర్ 3న హాజరు కావాలని కోరింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే సోరెన్ అనుచరుడైన పంకజ్ మిశ్రాను అరెస్ట్ చేసింది. అలాగే జులై 8న ఝార్ఖండ్ లోని 18 ప్రాంతాల్లో పంకజ్ మిశ్రాకు సంబంధించిన నివాసాలు, అతడి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది. 

ముఖ్యమంత్రి సోరెన్ ప్రతినిధిగా పంకజ్ మిశ్రా అక్రమ మైనింగ్, పడవల వ్యాపారం నిర్వహిస్తున్నట్టు ఈడీ గుర్తించింది. అతడి నుంచి ఇప్పటి వరకు రూ.42 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఇదే కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రి సోరెన్ నుంచి మరింత సమాచారం కోసం ఈడీ ప్రయత్నిస్తోంది. 

  • Loading...

More Telugu News