Team India: అడిలైడ్ లో శాంతించిన వరుణుడు... బంగ్లాదేశ్ లక్ష్యం కుదింపు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసిన భారత్
- బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా వర్షం
- అప్పటికి బంగ్లా స్కోరు 7 ఓవర్లలో 66 పరుగులు
- 16 ఓవర్లలో 151 పరుగులకు లక్ష్యం సవరించిన అంపైర్లు
అడిలైడ్ లో వర్షం తగ్గడంతో టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ మళ్లీ మొదలైంది. వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేయడం తెలిసిందే. కొత్త లక్ష్యం ప్రకారం ఆ జట్టు 54 బంతుల్లో 85 పరుగులు చేయాలి.
అయితే, ఆట పునఃప్రారంభమైన కాసేపటికే దూకుడు మీదున్న బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్ (60) రనౌట్ అయ్యాడు. దాంతో బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత షమీ బౌలింగ్ లో మరో ఓపెనర్ శాంటో (21) కూడా వెనుదిరిగాడు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 88 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 36 బంతుల్లో 63 పరుగులు చేయాలి. కాగా, ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.