Tollywood: పెళ్లయినా సినిమాలు ఆపేది లేదంటున్న హన్సిక

 Hansika wil not  quit acting post wedding with Sohael Khaturiya
  • ప్రియుడు సోహెల్ తో హన్సికకు నిశ్చితార్థం
  • డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్న జంట
  • ప్రస్తుతం హన్సిక చేతిలో పలు చిత్రాలు
‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై దక్షణాదిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హన్సిక మోత్వానీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. తన స్నేహితుడు సోహెల్ ఖతురియాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. సోహెల్ తో తన నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈఫిల్ టవర్ ముందు సోహెల్ తనకు ప్రపోజ్ చేస్తున్న ఫొటోలను హన్సిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ ప్యాలెస్లో ఈ జంట వివాహం జరగనుంది. అయితే, పెళ్లి తర్వాత హన్సిక నటిస్తుందా? లేదా? అన్న ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొంది. 

అయితే, హన్సిక మాత్రం తన వివాహానంతరం సినిమాలకు వీడ్కోలు చెప్పే ఆలోచనలో లేదు. పెళ్లయినా కెరీర్ కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసింది. ‘పెళ్లయ్యాక పని ఎందుకు మానేయాలి?’ అని హన్సిక అంటోంది. ఇక, తన ప్రియుడు సోహెల్ తనకు అత్యంత రొమాంటిక్ గా ప్రపోజ్ చేశాడని హన్సిక వెల్లడించింది. హన్సిక చివరగా యుఆర్ జమీల్ దర్శకత్వం వహించిన ‘మహా’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ‘పార్ట్‌నర్’, ‘రౌడీ బేబీ’, ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘గార్డియన్’, ‘ఎంవై3’ అనే చిత్రాలు నిర్మాణ దశల్లో ఉన్నాయి.
Tollywood
Kollywood
heroine
hansika
wedding
work

More Telugu News