Deltacron: డెల్టాక్రాన్ తో ప్రమాదం ఎక్కువే.. నిపుణుల హెచ్చరిక

Deltacron variants have potential to attack lungs like Delta spread like Omicron

  • ఇటీవల వెలుగు చూసిన పలు కొత్త వేరియంట్లు
  • ఊపిరితిత్తులపై వీటి తీవ్రత డెల్టా అంత ఎక్కువ
  • వేగంగా వ్యాప్తి చెందే గుణంతో ఆందోళన

కరోనా డెల్టా వేరియంట్ చూపించిన ఉపద్రవం గుర్తుండే ఉంటుంది. ఆక్సిజన్ అవసరమై, చివరికి కొరత ఏర్పడిన పరిస్థితులను గతేడాది వేసవిలో చూశాం. ఇప్పుడు వెలుగు చూసిన డెల్టా క్రాన్ కొత్త వేరియంట్ కూడా ఊపిరితిత్తులపై అంతే తీవ్రతను చూపించగలదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్ రకాలతో ఏర్పడిన రకమే డెల్టా క్రాన్, 

ఈ ఏడాది జనవరిలో డెల్టా క్రాన్ కేసులు మన దేశంలో వెలుగు చూశాయి. అప్పుడేమంత ప్రభావం చూపించలేదు. కానీ, ఇప్పుడు ఎక్స్ బీసీ, ఎక్స్ఏవై, ఎక్స్ఏడబ్ల్యూ అనే కొత్త రీకాంబినెంట్ వైరస్ రకాలు విస్తరిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. డెల్టా అంత ప్రమాదకరమైనవే కాకుండా, ఒమిక్రాన్ మాదిరి వేగంగా వ్యాప్తి చెందే గుణాలను కలిగి ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. 

డెల్టాతోపాటు, ఒమిక్రాన్ లో స్టెల్త్ వేరియంట్ గా పిలిచే బీఏ.2 కలగలిసిన రూపమే ఎక్స్ బీసీ. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఎక్స్ బీబీ పైనా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ రీకాంబినెంట్ వేరియంట్లు. ఒకటికి మించిన వైరస్ వేరియంట్లు కలసినప్పుడు ఇలా పిలుస్తారు. 

  • Loading...

More Telugu News