ISRO: దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరో గౌరవం.. ఉపగ్రహానికి పునీత్ పేరు

KGF 3 Satellite Named After Puneeth Rajkumar
  • ‘కేజీఎఫ్ 3 శాట్’ను అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 
  • ఈ నెలాఖరులో నింగిలోకి పంపనున్న ఇస్రో
  • ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా 75 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్న ఇస్రో
దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. పునీత్‌కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ‘కన్నడ రత్న’ పురస్కారాన్ని ప్రకటించి ఆయన భార్యకు అందజేసింది. తాజాగా, కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అభివృద్ధి చేసిన ‘కేజీఎఫ్ 3 శాట్’కు పునీత్ పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని ఈ నెల చివర్లో తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్‌వీ-సి 54 రాకెట్ ద్వారా నింగిలోకి పంపి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ISRO
Puneeth Rajkumar
KGF 3Sat

More Telugu News