Omicron: కరోనా బారిన పడితే.. ఈ డైట్ తో వైరస్ పై పైచేయి సాధించవచ్చు!

Fight Omicron with these essential nutrients

  • విటమిన్ ఏ, డీ, సీ కీలకం
  • ప్రొటీన్, ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కు చోటు
  • పసుపుతోనూ మంచి ఫలితం
  • రోగ నిరోధక వ్యవస్థ పటిష్ఠతతో మంచి రక్షణ

కరోనాలో కొత్త రకాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. డెల్టాక్రాన్ వేరియంట్ పై పలువురు నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా మాదిరిగా ఊపిరితిత్తులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సాధారణ ఫ్లూ మాదిరిగా కరోనా చాలా మందికి వ్యాపిస్తూనే ఉంది. మరి కరోనా అయినా.. వేరే ఇతర ఫ్లూ అయినా కొన్ని రకాల ఆహార పదార్థాలతో వాటిని కట్టడి చేయవచ్చు. 

ఏ వైరస్ అయినా దానిపై పోరాడాల్సింది మన రోగ నిరోధక వ్యవస్థ అన్న విషయం తెలియనిది కాదు. అయితే, పోషకాలతో కూడిన ఆహారం, సరిపడా నిద్ర, ఒత్తిళ్లు లేని జీవనంతోనే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడంలో ఆహారానికి పెద్ద పాత్రే ఉంది. ఇందుకోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన పోషకాల గురించి నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి.

ప్రొటీన్
గుడ్లు, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు, పాలు, పాల పదార్థాల్లో ప్రొటీన్ లభిస్తుంది.

విటమిన్ ఏ
క్యారట్లు, చిలకడ దుంపలు, పాలకూర, బ్రొకోలీలో విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పటిష్ఠం చేస్తుంది.

విటమిన్ సీ
జామకాయ, నిమ్మకాయలలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. కనుక రోజుకో జామ పండు, చెంచాడు నిమ్మరసం, తేనెతో కలిపి తీసుకుంటే విటమిన్ సీ లోటు లేకుండా చూసుకోవచ్చు.

ఒమెగా ఫ్యాటీ 3
ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ సైతం రోగ నిరోధకతలో కీలకంగా పనిచేస్తాయి. ఇవి గుండెను కాపాడడంలో ముఖ్యమైనవి. చెడు కొలెస్ట్రాల్ భరతం పడతాయి. చేపల్లో ఎక్కువగా లభిస్తాయి. శాకాహారులు అయితే ఫ్లాక్స్ సీడ్ తీసుకోవచ్చు. 

జింక్
జీవక్రియలు, రోగ నిరోధక శక్తికి జింక్ చాలా అవసరం. నట్స్, గుమ్మడి గింజలు, చేపల్లో జింక్ ఉంటుంది.

విటమిన్ డీ
విటమిన్ ఏ మాదిరే, విటమిన్ డీ కూడా రోగ నిరోధక వ్యవస్థకు అవసరం. కరోనా మొదటి విడతలోనే విటమిన్ డీ ప్రాముఖ్యత చాలా మందికి తెలిసొచ్చింది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుని కిరణాలు శరీరంపై పడేలా చూసుకుంటే సహజంగా మన శరీరమే విటమిన్ డీని తయారు చేసుకుంటుంది. పాల ఉత్పత్తులు, గుడ్లలోనూ లభిస్తుంది.

పసుపు
రోజువారీ ఆహారంలో పసుపును భాగం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది యాంటీ బయాటిక్ గా, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పనిచేస్తుంది. వీటి లోపం ఉన్న వారు వైద్యుల సూచనల మేరకు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

  • Loading...

More Telugu News