Munugode: రికార్డులు బద్దలు కొట్టిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్

munugode bypoll records highest polling in telangana

  • మునుగోడులో 93.13 శాతం పోలింగ్ నమోదు
  • ఇదే రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ శాతంగా రికార్డు
  • 2018లో మధిరలో 91.27 శాతాన్ని మించిన వైనం
  • ఈ నెల 6న మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్

తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గురువారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. తెలంగాణలో ఇప్పటిదాకా ఏ ఎన్నికపై జరగనంత చర్చ మునుగోడు ఉప ఎన్నికపై జరిగింది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కూడా అప్పటిదాకా నమోదైన రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ ఉప ఎన్నికల్లో 93.13 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇప్పటిదాకా నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదే కావడం గమనార్హం.

2018 ఎన్నికల్లోనూ మునుగోడులో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. నాడు మునుగోడులో 91.07 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అదే సమయంలో 2018 ఎన్నికల్లోనే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో 91.27 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితంగా తెలంగాణలో మొన్నటిదాకా అత్యధిక పోలింగ్ శాతంగా 91.27 శాతమే కొనసాగింది. తాజాగా మధిర రికార్డును బద్దలు కొట్టిన మునుగోడు ఉప ఎన్నిక ఏకంగా 93.13 శాతం పోలింగ్ తో అత్యధిక పోలింగ్ గా రికార్డులకెక్కింది. గురువారం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగియగా... ఈ నెల 6న కౌంటింగ్ జరగనుంది.

  • Loading...

More Telugu News