Musk: రోజుకు 40 లక్షల డాలర్లు నష్టపోతున్నాం: ట్విట్టర్ సీఈవో మస్క్

Twitter losing 4 million dollors per day

  • మరోమార్గం లేక ఉద్యోగాల్లో కోత విధింపు
  • ఉద్యోగం కోల్పోయిన వాళ్లను ఆదుకుంటామని వెల్లడి
  • మూడు నెలల పాటు సగం కన్నా ఎక్కువే జీతం చెల్లిస్తామన్న మస్క్

భారీ మొత్తం చెల్లించి ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. ప్రస్తుతం కంపెనీ నిర్వహణ ఖర్చులు తగ్గించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో మస్క్ స్పందించారు. ట్విట్టర్ రోజూ 40 లక్షల డాలర్లు నష్టపోతోందని వెల్లడించారు. నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం కోసమే ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని ట్వీట్ చేశారు.

తొలగించిన ఉద్యోగులకు ట్విట్టర్ అండగా ఉంటుందని మస్క్ చెప్పారు. మూడు నెలల పాటు వారికి 50 శాతం కంటే ఎక్కువే జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ సుమారు 44 బిలియన్ డాలర్లు వెచ్చించారు. కంపెనీ తన చేతుల్లోకి వచ్చిన వారంలోపే ఉద్యోగాలలో కోత మొదలు పెట్టారు. పొదుపు చర్యల్లో భాగంగా ట్విట్టర్ లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల నుంచి సాధారణ ఉద్యోగుల దాకా చాలామందిని ఇంటికి పంపించారు.

  • Loading...

More Telugu News