Hansika: కాబోయే భర్తతో సన్నిహితంగా ఉన్న ఫొటో లీక్ పై హన్సిక స్పందన

Hansika response on leakage of her photo with fiance
  • తన స్నేహితుడు సొహైల్ ను పెళ్లాడబోతున్న హన్సిక
  • డిసెంబర్ 4న జైపూర్ లో జరగనున్న వివాహం
  • ఫొటోను తాను షేర్ చేయలేదన్న హన్సిక
ప్రముఖ సినీ నటి హన్సిక త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ ను ఆమె పెళ్లాడనుంది. డిసెంబర్ 4న జైపూర్ లోని ఒక ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది. మరోవైపు వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోట్ లో వీరిద్దరూ వెళ్తుండగా ఆ ఫొటోను తీశారు. హన్సిక అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ ఫొటో బయటకు వచ్చింది. దీనిపై హన్సిక స్పందించింది. ఇది తన ఇన్స్టా ఖాతా కాదని ఆమె తెలిపింది. ఈ ఫొటోను తాను షేర్ చేయలేదని చెప్పింది. మరోవైపు కపుల్ బాగున్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Hansika
Tollywood
Kollywood
Love
Marriage
Photo

More Telugu News