KA Paul: మునుగోడు బైపోల్స్.. తొలి రౌండ్ లో కేఏ పాల్ కు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

KA Paul votes in Munugode first round counting
  • తొలి రౌండ్ లో కేఏ పాల్ కు 34 ఓట్లు
  • నోటాకు పడిన ఓట్ల సంఖ్య 29
  • చపాతీ రోలర్ గుర్తుకు 134 ఓట్లు
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ భారీగా పెరుగుతోంది. పోస్టల్ బ్యాలట్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి 4 ఓట్ల ఆధిక్యం అభించింది. అనంతరం తొలి రౌండ్లో కూడా టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని కనపరిచింది. అయితే తర్వాతి రౌండ్ల నుంచి బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. రెండు, మూడు రౌండ్లలో బీజేపీ లీడ్ సాధించింది. 

మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు 34 ఓట్లు వచ్చాయి. నోటాకు 29 ఓట్లు వచ్చాయి. కారు గుర్తును పోలి ఉండే చపాతి రోలర్ గుర్తుకు 134 ఓట్లు పడ్డాయి. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ, ఈవీఎంలతో ఎన్నికలను నిర్వహించడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలను నిర్వహించాలని తాను ముందు నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నానని అన్నారు.
KA Paul
Munugode
Results
First Round

More Telugu News