Ipaatam: ఎట్టకేలకు ఇప్పటంలో వైఎస్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు

Officials removed YSR statue in Ippatam

  • ఇప్పటంలో రోడ్డు విస్తరణ కార్యక్రమం
  • గాంధీ, నెహ్రూ, కలాం విగ్రహాలను తొలగించిన అధికారులు
  • వైఎస్ విగ్రహాన్ని తొలగించకపోవడంపై తీవ్ర వ్యతిరేకత

మంగళగిరి జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో కొన్ని ఇళ్ల కట్టడాలను తొలగించిన ఘటన వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. జనసేన సభకు స్థలాన్ని ఇచ్చారనే అక్కసుతోనే వైసీపీ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని విపక్షాలు మండిపడ్డాయి. మరోవైపు, రోడ్డు పక్కనున్న మహాత్మా గాంధీ, నెహ్రూ, అబ్దుల్ కలాం వంటి నేతల విగ్రహాలను కూడా అధికారులు తొలగించారు.

అయితే పక్కనే ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మాత్రం కూల్చలేదు. నిన్న పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా వైఎస్ విగ్రహానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ రెండంచెల ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు విగ్రహానికి కాపలా కాశారు. పవన్ కు భద్రతగా ఉండాల్సిన పోలీసులు వైఎస్ విగ్రహానికి పహారా కాశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, అధికారులు ఈరోజు వైఎస్ విగ్రహాన్ని కూడా తొలగించారు.

  • Loading...

More Telugu News