Rohit Sharma: పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతామన్నదే ముఖ్యం: ఇంగ్లండ్ తో సెమీస్ పై రోహిత్ శర్మ స్పందన

Rohit Sharma opines on semis with England

  • టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన భారత్
  • ఈ నెల 10న ఇంగ్లండ్ తో నాకౌట్ సమరం
  • ఇంగ్లండ్ తో పోరు సవాల్ వంటిదన్న రోహిత్ శర్మ
  • హోరాహోరీ పోరు తప్పదని వెల్లడి

ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లడం తెలిసిందే. సూపర్-12 దశలో ఐదు మ్యాచ్ లు ఆడిన భారత్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఓటమిపాలైంది. మిగతా నాలుగు మ్యాచ్ ల్లో నెగ్గి గ్రూప్ లో అగ్రస్థానంలో నాకౌట్ దశకు చేరింది. 

ఈ నెల 10న జరిగే సెమీఫైనల్లో భారత జట్టు ఇంగ్లండ్ తో తలపడనుంది. దీనిపై టీమిండియా సారథి రోహిత్ శర్మ స్పందించాడు. ఇంగ్లండ్ తో పోరు ఓ సవాల్ వంటిదని పేర్కొన్నాడు. పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతామన్నదే కీలకమని అభిప్రాయపడ్డాడు. సెమీస్ మ్యాచ్ జరిగే అడిలైడ్ ఓవల్ లో తాము ఇప్పటికే ఓ మ్యాచ్ ఆడామని, దాంతో ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉందని హిట్ మ్యాన్ తెలిపాడు. 

ఇటీవల కాలంలో ఇంగ్లండ్ రాణిస్తోందని, ఆ జట్టుతో తాము ఆడబోయే మ్యాచ్ లో హోరాహోరీ పోరు తప్పదని పేర్కొన్నారు. ఈ టోర్నీలో సెమీస్ ఎలా చేరామన్న విషయం తాము మర్చిపోలేదని, సెమీస్ లోనూ అదే తరహా దృక్పథంతో బరిలో దిగుతామని అన్నాడు. వ్యక్తులుగా తాము జట్టు కోసం ఏం చేయగలమో ఆలోచిస్తామని రోహిత్ శర్మ వివరించాడు.

  • Loading...

More Telugu News