KA Paul: కేటీఆర్ దత్తత తీసుకోవడమంటే ఇదే: కేఏ పాల్
- మునుగోడులో ప్రధాన పార్టీలు అక్రమాలకు పాల్పడ్డాయన్న కేఏ పాల్
- అధికారులంతా టీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేశారని మండిపాటు
- మునుగోడు ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్
మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు భారీ అక్రమాలకు పాల్పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఓటర్లను ఈ పార్టీలు ప్రలోభ పెట్టాయని అన్నారు. పోలింగ్ కు ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని తాము కోరినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. అధికారులంతా టీఆర్ఎస్ కోసం పని చేశారని దుయ్యబట్టారు.
మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చెప్పారని... కేటీఆర్ దత్తత తీసుకోవడమంటే అక్కడున్న భూములను ఆక్రమించడం, అమ్ముకోవడం, లక్షల కోట్లను దోచేయడమేనని అన్నారు. మునుగోడు ఎన్నికను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఎన్నికలో పాల్ కు 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. 13వ రౌండ్ లో అత్యధికంగా 86 ఓట్లను ఆయన సాధించారు.