Telangana: ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెయిల్.. షరతులు విధించిన హైకోర్టు
- విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్టయిన రాజా సింగ్
- షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని షరతు
- మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయవద్దని సూచన
విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెయిల్ మంజూరైంది. దాదాపుగా 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజా సింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.