Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్... బృందం చీఫ్ గా సీవీ ఆనంద్
- మొత్తం ఏడుగురు పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు
- సీవీ ఆనంద్ తో పాటు ఆరుగురు పోలీసు అధికారులకు సిట్ లో చోటు
- హైకోర్టు తీర్పు వెలువడిన మరునాడే సిట్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిందని భావిస్తున్న యత్నంపై ప్రత్యేక దర్యాప్తునకు తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఈ కేసుపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన మరునాడే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం గమనార్హం.