Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం... పోలీసు కస్టడీకి ముగ్గురు నిందితులు
- టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు యత్నంపై కేసు
- రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ ల అరెస్ట్
- నిందితులను 5 రోజుల కస్టడీ కోరిన తెలంగాణ పోలీసులు
- 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు
తెలంగాణలో సంచలన రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన రోజే.. ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.