MS Dhoni: జడేజాను సీఎస్కే తోనే కొనసాగించాలని ధోనీ పట్టుదల?
- అతడ్ని విడుదల చేయాలన్న ఆలోచనలో యాజమాన్యం
- జట్టు ప్రయోజనాల రీత్యా జడేజాను కొనసాగించాలన్నది ధోనీ సూచన
- 15వ తేదీ నాటికి విడుదల చేసే ఆటగాళ్ల వివరాలు ఇవ్వాల్సిందే
ఐపీఎల్ 2023కు సన్నాహాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. నవంబర్ 15 నాటికి 10 ఫ్రాంచైజీలు.. తమ దగ్గరున్న ఆటగాళ్లలో ఎవరిని విడిచి పెట్టాలని భావిస్తున్నాయో అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా వివిధ జట్లు విడుదల చేసిన ఆటగాళ్లు, కొత్త ఆటగాళ్లతో మినీ వేలాన్ని బీసీసీఐ డిసెంబర్ లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
గత సీజన్ కు రూ.16 కోట్ల భారీ మొత్తంతో జడేజాను సీఎస్కే అట్టిపెట్టుకోవడం తెలిసిందే. సీఎస్కేలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వాడిగా జడేజా గుర్తింపు పొందాడు. ఇక ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్ ను సైతం సీఎస్కే వదిలేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏ జట్లు ఏఏ ఆటగాళ్లను వదిలేస్తాయన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.