Sensex: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు.. 941 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- వరుసగా నాలుగో నెల తగ్గిన అమెరికా ద్రవ్యోల్బణం
- పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్న ప్రపంచ మార్కెట్లు
- 3 శాతానికి పైగా లాభాల్లో ఐటీ, టెక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోతున్నాయి. అమెరికాలో వరుసగా నాలుగో నెల ద్రవ్యోల్బణం తగ్గడంతో అక్కడి మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీని ప్రభావంతో ప్రపంచ మార్కెట్లన్నీ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెమ్మదించవచ్చనే అంచనాలు మార్కెట్లలో జోష్ నింపాయి.
ఈ క్రమంలో ఉదయం 10.28 గంటల సమయంలో సెన్సెక్స్ 941 పాయింట్ల లాభంతో 61,556 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 270 పాయింట్లు పుంజుకుని 18,299 వద్ద కొనసాగుతోంది. ఐటీ, టెక్ సూచీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ 4.28 శాతం, హెచ్సీఎల్ 3.78 శాతం, టీసీఎస్ 3.73 శాతం, టెక్ మహీంద్రా 3.43 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.