DigiLocker: డిజీలాకర్ లో భద్రంగా హెల్త్ రిపోర్ట్ లు

DigiLocker users can now store health reports

  • ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ తో డిజీలాకర్ అనుసంధానం
  • హెల్త్ రికార్డులు స్టోర్ చేసుకుని, షేర్ చేసుకోవచ్చు
  • ఇతర డాక్యుమెంట్లకూ సురక్షితమైన ఆన్ లైన్ స్టోరేజీ వేదిక

డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో ఆన్ లైన్ లో నిల్వ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న వేదిక ‘డిజీ లాకర్’. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనిది. కనుక రక్షణ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు ఈ డిజీలాకర్ లో పౌరులు తమ హెల్త్ రిపోర్ట్ లను కూడా భద్రంగా దాచుకోవడమే కాకుండా, వాటిని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ తో లింక్ చేసుకోవచ్చని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ఏ) ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేసే విభాగమే నేషనల్ హెల్త్ అథారిటీ. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను డిజీలాకర్ తో రెండో అంచె అనుసంధానాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు ఎన్ హెచ్ఏ ప్రకటించింది. 

డిజీలాకర్ లో హెల్త్ రికార్డులు స్టోర్ చేసుకోవడంతోపాటు, వాటిని ఇతరులతో షేర్ కూడా చేసుకోవచ్చు. డిజీలాకర్ లో మన గుర్తింపు, చిరునామా, లైసెన్స్, పాన్ కార్డ్, ఇలా అన్ని రకాల డాక్యుమెంట్లను స్కాన్ చేసి, డిజిటల్ గా అప్ లోడ్ చేసుకుని, కావాల్సిన సందర్భాల్లో వాటిని పొందొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలకు షేర్ చేయవచ్చు. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర సర్కారు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఆన్ లైన్ లో క్లౌడ్ స్టోరేజీ సదుపాయాన్ని ఉచితంగా పొందడం. ఆధార్ నంబర్ ఆధారంగా ఈ ఖాతాను తెరవొచ్చు. 1జీబీ వరకు స్టోరేజీ ఉచితం.

  • Loading...

More Telugu News