Virat Kohli: కల నెరవేరకుండానే ఆస్ట్రేలియాను వీడుతున్నాం: కోహ్లీ
- టీ20 వరల్డ్ కప్ నుంచి భారత్ నిష్క్రమణ
- సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో భంగపాటు
- తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన కోహ్లీ
- భవిష్యత్ పై దృష్టి సారిస్తామని వెల్లడి
టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాభవం చవిచూసిన టీమిండియా స్వదేశానికి తిరిగొస్తోంది. దీనిపై టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. కప్ సాధించాలన్న కల నెరవేరకుండానే ఆస్ట్రేలియాను వీడుతున్నామని విచారం వ్యక్తం చేశాడు. హృదయాలు తీవ్ర నిరాశతో నిండిపోయాయని తెలిపాడు.
అయితే ఈ టోర్నీలో జట్టుగా అనేక మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకున్నామని, ఇకపై భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించాలన్న లక్ష్యంతో ముందుకెళతామని కోహ్లీ పేర్కొన్నాడు.
వరల్డ్ కప్ లో తాము ఆడిన ప్రతిమ్యాచ్ కు వెల్లువలా తరలవచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించాడు. టీమిండియా జెర్సీ ధరించి, భారత్ కు ప్రాతినిధ్యం వహించడాన్ని ఎల్లప్పుడూ గర్వకారణంగా భావిస్తానని తెలిపాడు.