Arvind Kejriwal: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో... కేజ్రీవాల్ ఇచ్చిన 10 హామీలు ఇవే!
- డిసెంబర్ 4న ఎంసీడీ ఎన్నికలు
- డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు
- గెలవాలనే పట్టుదలతో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు
డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని ప్రధాన పార్టీలన్నీ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ 10 హామీలను ఇచ్చారు. డిసెంబర్ 7న ఓట్ల లెక్కంపు జరగనుంది.
కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు:
- చెత్తకుప్పలను తొలగించడం ద్వారా ఢిల్లీ వీధులను పరిశుభ్రంగా ఉంచడం
- అక్రమాలకు చెక్ పెట్టడం ద్వారా అవినీతి రహితంగా మార్చడం
- దేశ రాజధానిలో పార్కింగ్ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వడం
- రోడ్లపై సంచరించే జంతువుల సమస్యను పరిష్కరించడం
- రోడ్ల మరమ్మతులతో పాటు నగర సుందరీకరణ
- ప్రపంచ స్థాయి విద్య, వైద్య మౌలిక సదుపాయాలను కల్పించడం
- పార్కుల సుందరీకరణ
- మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్లకు సకాలంలో వేతనాలను ఇవ్వడం
- ఢిల్లీలోని వ్యాపారవేత్తలు, వ్యాపారుల సమస్యలను పరిష్కరించడం
- అవినీతిని అరికట్టేందుకు విక్రేతలకు వెండింగ్ జోన్ ఏర్పాటు చేయడం