Botsa Satyanarayana: మోదీని పవన్ కలిస్తే మాకేంటి?: మంత్రి బొత్స

Minister Botsa refused to comment on Pawan Kalyan meeting with prime minister Modi

  • విశాఖలో నేడు మోదీ, పవన్ సమావేశం
  • స్పందించాలంటూ బొత్సను కోరిన మీడియా
  • రాజకీయాల్లో ఇలాంటి భేటీలు రొటీన్ అని పేర్కొన్న బొత్స
  • భూతద్దంలో చూడాల్సిన అవసరంలేదని వెల్లడి

ఇవాళ విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలవనుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇదేమంత చర్చనీయాంశం కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

రాజకీయల్లో ఇలాంటి భేటీలు సహజమేనని అభిప్రాయపడ్డారు. నేతలు ఒకరినొకరు కలుసుకోవడంలో ఆశ్చర్యమేముందని, రాజకీయాల్లో ఇవి రొటీన్ అని అన్నారు. మోదీతో పవన్ సమావేశమైతే తామెందుకు స్పందించాలని బొత్స ప్రశ్నించారు. ఈ భేటీని భూతద్దంలో చూడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. 

గతంలో పవన్ ఢిల్లీలో మోదీని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ దొరకలేదు అంటూ ఓ మీడియా ప్రతినిధి బొత్సను అడగ్గా, అవన్నీ ఆయా పార్టీల అంతర్గత వ్యవహారాలు అని, వాటిపై తామెలా స్పందిస్తామని బొత్స బదులిచ్చారు. 'నేనేమైనా వారి పార్టీకి సంబంధించిన వాడ్నా... అలాంటి విషయాలపై నేను మాట్లాడను' అని కరాఖండీగా చెప్పేశారు.

  • Loading...

More Telugu News