Karthik Raj: కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరోహీరోయిన్లుగా.. దండమూడి బాక్సాఫీస్, సాయిస్రవంతి మూవీస్ చిత్రం
- సింగిల్ షెడ్యూల్‌లో 35-40 రోజుల్లో సినిమాను పూర్తి చేసే ప్లాన్
- హైదరాబాద్, బ్యాంకాక్, ఫుకెట్‌లలో చిత్రీకరణ
- లవ్, యాక్షన్, క్రైమ్ డ్రామాగా రూపొందే చిత్రం
కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరోహీరోయిన్లుగా దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ ప్రొడక్షన్ నంబరు 2 నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. అంజీ రామ్ దర్శకత్వంలో దండమూడి అవనింద్ర కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అవనింద్ర కుమార్ క్లాప్ కొట్టారు. ప్రముఖ సింగర్ మనో కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆకాష్ పూరి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల స్క్రిప్ట్‌ను అందించారు.
ఈ సందర్భంగా.. దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ అధినేత, నిర్మాత దండమూరి అరవింద్ కుమార్ మాట్లాడుతూ .. సినిమాను 35-40 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. హైదరాబాద్, బ్యాంకాక్, ఫుకెట్ సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నట్టు చెప్పారు.
సాయి స్రవంతి మూవీస్ అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ.. సినిమాలో కార్తీక్ రాజు, త్వరిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారని, ప్రధాన తారాగణం ఇంకా చాలామందే ఉన్నారని అన్నారు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. నటుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ.. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇదని చెప్పారు. డిఫరెంట్ స్క్రిప్ట్ అని, మంచి టీమ్ కుదిరిందని అన్నారు. లవ్, యాక్షన్, క్రైమ్ డ్రామా ఉన్న ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నట్టు చెప్పారు.
నటి త్వరిత నగర్ మాట్లాడుతూ.. దండమూడి బాక్సాఫీస్ బ్యానర్‌లో హీరోయిన్‌గా నటించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మంచి నిర్మాతలతో కలిసి చేస్తున్న ఈ సినిమాతో బ్యానర్‌కు పేరు తీసుకొస్తామని దర్శకుడు అంజీ రామ్ అన్నారు. నవంబర్ 14 నుంచి సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తామన్నారు.
ఈ సినిమాలో కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా అలీ, నందినీ రాయ్, భద్రం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దండమూడి బాక్స్ ఆఫీస్, సాయి స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందుతున్నఈ సినిమాకు దండమూడి అవనింద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సాయిస్రవంతి మూవీస్ (గొట్టిపాటి సాయి) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వం అంజీరామ్. డైలాగ్స్ ప్రభోద్ డామెర్ల అందించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఎస్. మురళీమోహన్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఎడిటర్‌గా జె. ప్రతాప్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్‌గా మూసి ఫణితేజ పనిచేస్తున్న ఈ సినిమాకు బియాండ్ మూవీస్ నాయుడు - ఫణి పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు.