Fixed deposits: ఈ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు

Fixed deposits offres highest interest rates

  • 2 ఏళ్ల డిపాజిట్ పై డీసీబీ బ్యాంకు 7.5 శాతం ఆఫర్
  • బంధన్, సీటీ యూనియన్, ఇండస్ ఇండ్ బ్యాంకుల్లో 7 శాతం
  • ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్ డీలపైనా 7 శాతం రేటు

బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు.. ఇప్పటికీ ఎంతో మందికి నమ్మకమైన పొదుపు సాధనం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. సమీపంలోనే బ్యాంకు శాఖకు వెళ్లి డిపాజిట్ చేసుకోవడమే కాకుండా, అవసరమైనప్పుడు వెంటనే వెళ్లి తీసుకోగల సౌలభ్యం ఎక్కువ మందికి అనుకూలం. ఇప్పుడు ఆన్ లైన్ లోనూ డిపాజిట్ చేసుకోవడం, రద్దు చేసుకోవడాన్ని చాలా బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఎక్కువ వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఉన్నాయన్నది చూస్తే..

2 ఏళ్లపై అధిక రేటు
డీసీబీ బ్యాంకు 2 ఏళ్ల డిపాజిట్ పై అత్యధికంగా 7.50 శాతం ఆఫర్ చేస్తోంది. బంధన్ బ్యాంకు 7 శాతం, సిటీ యూనియన్ బ్యాంకు 7 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 7 శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.95 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 

పన్ను ఆదా కోసం..
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఏడాదిలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. కాకపోతే ఈ మొత్తాన్ని చట్టంలో పేర్కొన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనంతో కూడిన ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్లను దాదాపు అన్ని బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే ఐదేళ్ల వరకు ఈ డిపాజిట్ ను వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉండదు.

డీసీబీ బ్యాంకు 7.25 శాతం, సిటీ యూనియన్ బ్యాంకు 7 శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.95 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 6.75 శాతం, యస్ బ్యాంకు 6.75 శాతం చొప్పున ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్ డీలపై వార్షిక రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే ఫిక్స్ డ్ డిపాజిట్లు ఏవైనా కానీ, వాటిపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇక ఆర్ బీఐ నియంత్రణల పరిధిలోని  ఏ బ్యాంకు సంక్షోభంలో పడినా.. ఒక్కో డిపాజిట్ దారునికి ఒక బ్యాంకు పరిధిలో గరిష్ఠంగా రూ.5 లక్షలు బీమా కింద వస్తుంది.

  • Loading...

More Telugu News