Andhra Pradesh: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... నేడు ఏపీలో భారీ వర్షాలు

IMD issues rain alert for Rayalaseema and South Coastal Andhra

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
  • అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
  • దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు
  • సముద్రం అలజడిగా ఉంటుందన్న ఐఎండీ

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించింది. గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. 

కాగా, అల్పపీడనం క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా కేరళ వైపు పయనిస్తుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతాల్లోనూ, ఘాట్ ఏరియాల్లోనూ, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. 

నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News