New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు

Tremors at Delhi region

  • రాత్రి 7.57 గంటలకు కంపించిన భూమి
  • ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు
  • నేపాల్ లో భూకంప కేంద్రం
  • రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రత 

దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్ లో ఉందని, రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.4 అని తెలిపింది. రాత్రి 7.57 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్టు పేర్కొంది. 

దేశ రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు రావడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత బుధవారం కూడా ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. 

కాగా, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఓ భారీ భూకంపం వచ్చేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల హెచ్చరిస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని చెబుతున్నారు. 

ఇటీవల కాలంలో భారత భూ ఫలకంపై యూరేషియన్ భూ ఫలకం ఒత్తిడి స్థిరంగా కొనసాగుతోందని, ఈ సందర్భంగా జనించే శక్తి భూకంపాల రూపంలో వెలువడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News