Hansika: ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానున్న హన్సిక పెళ్లి?

Hansika marriage to  stream in OTT
  • వచ్చే నెల 4న హన్సిక పెళ్లి
  • సొహైల్ ను ప్రేమ వివాహం చేసుకుంటున్న హన్సిక
  • ఇప్పటికే ప్రారంభమైన పెళ్లి పనులు
అందాల నటి హన్సిక పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు సొహైల్ ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. వీరి వివాహం వచ్చే నెల 4వ తేదీన జైపూర్ లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో జరగబోతోంది. పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. 

మరోవైపు వీరి పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరి వివాహ వేడుక ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడలేదు. గతంలో నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లి కూడా నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, ఆ వీడియో ఇంతవరకు విడుదల కాలేదు.
Hansika
Marriage
OTT Streaming
Tollywood
Kollywood

More Telugu News