Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 170 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 20 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత స్వల్ప లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టపోయి 61,624కి పడిపోయింది. నిఫ్టీ 20 పాయింట్లు కోల్పోయి 18,329 వద్ద స్థిరపడింది.
కోటక్ బ్యాంక్ (1.27%), టాటా స్టీల్ (1.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.05%), ఇండస్ ఇండ్ బ్యాక్ (1.04%), ఇన్ఫోసిస్ (0.89%).
డాక్టర్ రెడ్డీస్ (-3.94%), ఐటీసీ (-2.57%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.83%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.42%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.32%).