Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులకు చుక్కెదురు

ts acb court dismisses mlas poaching case accused

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందిలుగా రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్
  • సుప్రీంకోర్టు సూచనతో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన వైనం
  • నిందితులకు బెయిల్ ఇస్తే కేసు విచారణ ప్రభావితం అవుతుందన్న ప్రభుత్వం
  • బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సోమవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఈ కేసులోని నిందితులు ముగ్గురికీ చుక్కెదురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజులు, నంద కుమార్ లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

మునుగోడు ఉప ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించిన నిందితులు తమకు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు సూచనతో ట్రయల్ కోర్టు అయిన ఏసీబీ కోర్టులో వారు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం విచారణ జరగగా.. కేసు విచారణ కీలక దశలో వుందనీ, ఇలాంటి సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే కేసు విచారణతో పాటు సాక్షులు కూడా ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు.... నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

  • Loading...

More Telugu News