Vasanthi: బిగ్ బాస్ హౌస్ లో నేను ఉన్నంతవరకూ జరిగింది ఇదే: వాసంతి

Bigg Boss 6  Update

  • బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన వాసంతి 
  • తాను ఆడలేదనేది అబద్ధమని వ్యాఖ్య 
  • ఆదిరెడ్డి మాటలు బాధించాయని వెల్లడి 
  • ఫైమా అలా చేస్తుందనుకోలేదంటూ వివరణ

'బిగ్ బాస్ హౌస్' నుంచి ఈ వారం వాసంతి ఎలిమినేట్ అయింది. హౌస్ లో అందంగా కనిపిస్తూ అందరితో బుట్టబొమ్మ అనిపించుకున్న వాసంతి, బయటికి వచ్చిన తరువాత వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను అందంగా ముస్తాబై కూర్చోవడం .. ఉదయాన్నే నిద్రలేవంగానే ఒక సాంగ్ కి డాన్స్ చేయడం తప్ప ఏమీ ఆడలేదనే ఒక విమర్శ వచ్చిందని విన్నాను. కానీ నేను ఆడటం వల్లనే ఇంతవరకూ హౌస్ లో నన్ను ఉంచారనే విషయం మరిచిపోవద్దు" అంది. 

హౌస్ లో ఒకరికి ఒకరు సపోర్టు చేసుకుంటూ కలిసి ఆడేవారు ఉన్నారు. అలాంటివారిలో శ్రీహాన్ .. శ్రీ సత్య ముందు వరుసలో కనిపిస్తారు. నా గేమ్ ను నేను ఒంటరిగా ఆడుతూ వెళ్లడం జరిగింది. నేను గేమ్ కి సంబంధించిన విషయాలను గురించి మాట్లాడానే తప్ప, అనవసరమైన విషయాలను గురించి ఎప్పుడూ వాదన చేసింది లేదు. హౌస్ లో రేవంత్ ఫిజికల్ గేమ్స్ చాలా బాగా ఆడతాడు. ఎక్కడ తగులుతాడోనని భయం వేసేది. ఇక 'నేను గేమర్స్ తోనే మాట్లాడతాను' అంటూ  ఆదిరెడ్డి తక్కువ చేయడం నాకు నచ్చలేదు" అని చెప్పింది.

"ఇనయా చాలా మంచిదే .. అయితే తనకి సంబంధం లేని విషయంలో తాను వెళ్లి దూరుతూ ఉంటుంది. అదే నాకు నచ్చలేదు .. ఈ విషయాన్ని తనతోనే నేరుగా చెప్పాను కూడా. శ్రీహాన్ కి ఒక ఫ్రెండ్ గా నేను ఎంతో సపోర్ట్ చేశాను .. కానీ ఆయన దగ్గర నుంచి నేను ఆశించిన సపోర్టు లభించలేదు. ఇక శ్రీ సత్య కొంతవరకూ తన పద్ధతిని మార్చుకుంది. తన కెప్టెన్సీకి నేను అడ్డొచ్చానని చెప్పి నన్ను ఫైమా నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఇక బాలాదిత్య మాటలు నాకు ఎప్పటికప్పుడు ఊరట కలిగిస్తూ ఉండేవి" అంటూ చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News