Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేందుకు జకోవిచ్ కు తొలగిన అడ్డంకి

Novak Djokovic likely to get Australian visa

  • ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ కు దూరమైన జకో 
  • కరోనా వ్యాక్సిన్ తీసుకోని మాజీ నెంబర్ వన్ 
  • తిప్పి పంపిన ఆస్ట్రేలియా ప్రభుత్వం
  • జకోవిచ్ పై మూడేళ్ల నిషేధం
  • ఆస్ట్రేలియాలో కొత్త ప్రభుత్వం.. మారిన విధానాలు

మాజీ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. జకోవిచ్ కు వీసా మంజూరు చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడైంది. 

కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జకోవిచ్ ను ఆడనివ్వలేదు. టోర్నీలో ఆడేందుకు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టినప్పటికీ, వ్యాక్సిన్ తీసుకోని కారణంగా నిబంధనల ప్రకారం అతడిని తిప్పి పంపారు. అంతేకాదు, అతడిపై మూడేళ్ల నిషేధం కూడా విధించారు. 

కరోనా సంక్షోభం నేపథ్యంలో, ఆస్ట్రేలియా ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకున్నవారినే తమ దేశంలోకి అడుగుపెట్టేందుకు అనుమతిస్తోంది. కానీ, వ్యాక్సిన్ తీసుకోవడం, తీసుకోకపోవడం అనేది తన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని జకోవిచ్ వాదిస్తున్నాడు. 

జకోవిచ్ పై నిషేధం విధించిన సమయంలో ఆస్ట్రేలియాలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నాయకత్వంలో ఆస్ట్రేలియాలో వామపక్ష భావజాల లేబర్ పార్టీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. దాంతో అక్కడి ప్రభుత్వ విధానాలు మారాయి. 

ఈ నేపథ్యంలోనే జకోవిచ్ పై మూడేళ్ల నిషేధం ఎత్తివేసి వీసా మంజూరు చేయాలని అల్బనీస్ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News